కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: రేవంత్
తెలంగాణ : నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. హైదరాబాద్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
Comments