ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి తో సురేఖ భేటీ
తెలంగాణ : ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను మీనాక్షికి వివరించారు. తన ఇంటికి పోలీసులు రావడం, అక్కడ జరిగిన వివాదంపై చర్చించారు. తన కూతురు వ్యాఖ్యలపైనా సురేఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొండా సురేఖ వివాదంపై ఏఐసీసీ నివేదిక అడిగిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
Comments