గ్రామాల రక్షణకు మహిళల గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్ వారణాసి గ్రామాల్లో పరిశుభ్రత, చైతన్యం కోసం మహిళలతో ఏర్పడిన గ్రీన్‌ఆర్మీ ఎన్నో సాంఘిక సంస్కరణలు చేస్తోంది. 2015లో రవిమిశ్ర అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఉద్యమం 22 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ఆర్మీలో 2,200 మంది మహిళలు ఉన్నారు. వీరు గృహహింస, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరిస్తున్నారు. చెప్పులు, నారసంచుల తయారీతో ఉపాధి కూడా పొందుతున్నారు. వీరి కృషిని గుర్తించి PM మోదీ కూడా అభినందించారు.
Comments