డిసెంబరు 6 లోపు వక్ఫ్ ఆస్తుల నమోదు తప్పనిసరి
అమరావతి : నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమీద్ చట్టం ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదరసాలు డిసెంబరు 6లోపు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రతి వక్ఫ్ సంస్థ తమ జిల్లాలోని ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ కార్యాలయాన్ని సంప్రదించాలని శనివారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ పోర్టల్‌లో నమోదు చేయబడిన ఆస్తుల వివరాలు ప్రభుత్వ డేటాబే స్‌లో భద్రపరచబడతాయని తెలిపారు. నమోదు కాని వక్ఫ్ ఆస్తులు చట్టపరంగా వివాదాస్పద భూములుగా పరిగణించబడతాయని, వాటికి వక్ఫ్ బోర్డు నుంచి రక్షణ, సహాయం లభించదని ఆయన పేర్కొన్నారు. సందేహాలుంటే రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో హెల్ప్‌లైన్ నంబరు 9490044933ను సంప్రదించాలని పేర్కొన్నారు.









Comments