మానవత్వం మరిచిన తండ్రి.. చిన్నారిని దారుణంగా..
కర్నూలు: జిల్లాలోని దేవనకొండలో దారుణం ఘటన జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు తండ్రి వీరేశ్. అనంతరం భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి ప్రయత్నించాడు భర్త వీరేశ్. శ్రావణి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రావణికి వైద్యం అందిస్తున్నారు వైద్యులు.
కాగా, గతంలో మొదటి భార్యని చంపేసి జైలుకు వెళ్లివచ్చాడు వీరేశ్. అయితే, వీరేశ్పై కర్నూల్ జిల్లా పోలీసులకు శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments