యువతిపై హత్యాచారం.. దోషికి 20 ఏళ్ల జైలు
సంగారెడ్డి : యువతిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి సిద్దిపేట జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.1.5 లక్షల జరిమానా విధించింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతిని అత్యాచారం, హత్య చేసిన కేసులో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట్‌కు చెందిన పింగళి నరేందర్ రెడ్డి (44) నిందితుడు. నేరం చేసినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని మొదట జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు. తర్వాత దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల మధ్య 2013 నుంచి వాదనలు కొనసాగుతుండగా, దాదాపు 13 ఏళ్ల తర్వాత సిద్దిపేట మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది. మరో కేసులో బాలికపై అత్యాచార నేరం రుజువు కావడంతో దోషికి సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఝార్ఖండ్‌కు చెందిన కడంబాల జ్ఞానేశ్వర్ అలియాస్ దుర్గాప్రసాద్ (20) జిన్నారం మండలం బొల్లారంలో నివాసముంటూ 2019 మే 3న ఓ ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయాధికారి జయంతి బుధవారం తీర్పునిచ్చారు.
Comments