విడాకులకు దారితీసే 4 కారణాలివే: నిపుణులు
వైవాహిక జీవితంలో విడాకులకు దారితీసే 4 ప్రధాన అంశాలపై మానసిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అవే.. సమర్థించుకోవడం, విమర్శించడం, ధిక్కారం, చెప్పింది వినకపోవడం. ‘ఈ లక్షణాలు భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ నాలుగు అంశాలను నియంత్రించకపోతే వివాహ రథం విడాకులవైపు వేగంగా పయనించడం ఖాయం’ అని నిపుణులు సూచిస్తున్నారు. సామరస్యం కోసం వాటిని దూరం పెట్టాలి.
Comments