వాయుగుండం.. భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా, రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేసింది. ఈ నెల 28న సాయంత్రం తీరం దాటే ఆవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని తెలిపింది.










Comments