• Apr 05, 2026
  • NPN Log

    ఎండాకాలంలో పాలు తరచూ విరిగిపోతూ ఉంటాయి. తెచ్చిన వెంటనే బాగా మరిగించినప్పటికీ ఒక్కోసారి ఫలితం ఉండదు. అలాకాకుండా పాలు ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే ఏ చిట్కాలు పాటించండి.

    పాలను మరిగించడానికి శుభ్రంగా పొడిగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. ఒకసారి పాలు పోసి కాచిన గిన్నెను కడగకుండా మరోసారి ఉపయోగించకూడదు.

    పాలను చిన్నమంట మీద మరిగించాలి. పొంగుతున్న దశకు చేరిన తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసి రెండు నిమిషాల తరువాత మరలా వెలిగించి మరో అయిదు నిమిషాలపాటు మరిగించాలి. అప్పుడే పాలలోని హానికారక బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.

    పాలను మరిగించేటప్పుడు అందులో చిటికెడు వంట సోడా వేస్తే చాలాసేపటి వరకు పాలు తాజాగా ఉంటాయి.

    పాలు మరిగిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి.

    ఆ తరువాతే పాల గిన్నెపై సరైన మూత పెట్టాలి.

    చల్లారిన పాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. రెండు లేదా మూడో అరలో పాల గిన్నెను పెడితే రాత్రి వరకు పాలు తాజాగా ఉంటాయి.

    వెడల్పాటి గిన్నెలో చల్లటి నీళ్లు పోసి అందులో పాల గిన్నె పెడితే అయిదారు గంటలు తాజాగా ఉంటాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement