• Jul 26, 2026
  • NPN Log

    అనకాపల్లి : అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గం నుంచి దివ్య దర్శన యాత్రకు తీసుకెళ్లడం ఇదే మొదటిసారని వెల్లడించారు. తనకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో దివ్య దర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని వివరించారు.

    భక్తులకు ఉచిత ప్రయాణంతో పాటు వసతి, దర్శనం కల్పిస్తున్నామని ఎంపీ రమేశ్ తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి భవిష్యత్తులో మరెన్నో దివ్య దర్శన యాత్రలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహాయం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఏపీ అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందని చెప్పారు. అనకాపల్లి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనేక పరిశ్రమలు అనకాపల్లికి వస్తున్నాయని ఎంపీ రమేశ్ పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement