• Jul 26, 2026
  • NPN Log

    హైదరాబాద్ : నీట్ పరీక్ష అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అనవసర రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, ఆప్‌ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. నీట్ పరీక్ష పేరుతో కొందరు ఉద్దేశపూర్వకంగా దేశంలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. గతంలో ఎన్నడూ పేపర్ లీక్ జరగనట్లు ఇప్పుడు వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కుట్రపూరితంగా ఈ అంశాన్ని రాజకీయ రంగంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతోనే ఈ ప్రచారం సాగుతోందని ఆమె ఆరోపించారు.

    ఈ సందర్భంగా డీకే ఆరుణ మాట్లాడుతూ.. ‘కేంద్రం తలుచుకుంటే రేవంత్ ఒక్కరోజు సీఎం కుర్చీలో ఉండరు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడపటం రాహుల్‌కు అలవాటు. కేంద్రం సహకారం లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేయలేదు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా రేవంత్ వ్యవహారశైలి ఉంది. జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో.. ఎవరు చేయించారో తెలుసు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకైనప్పుడు అప్పటి బాధ్యులు ఎందుకు రాజీనామా చేయలేదు. గతంలో జరిగిన పేపర్ లీకేజీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అలవాటైంది. నల్ల దుస్తులు ధరించి గేట్ల ముందు నిలబడటం తప్ప రాహుల్ గాంధీ దేశానికి, విద్యార్థులకు చేసిన మేలు ఏమిటి’ అని అన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement