• Jul 26, 2026
  • NPN Log

    వాషింగ్టన్‌ : నాసా వ్యోమగాములు క్రిస్‌ విలియమ్స్‌, జెస్సికా మిర్‌లు మంగళవారం భూమికి 400కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎ్‌సఎస్‌) వెలుపల 7.20గంటల పాటు స్పేస్‌ వాక్‌ చేశారు. ఎంతో కష్టపడి ఐఎ్‌సఎ్‌సలో అత్యంత కీలకమైన ‘కెనడార్మ్‌2’ అనే 17.6 మీటర్ల పొడవైన రోబోటిక్‌ చేతి మణికట్టు(జాయింట్‌)ను మార్చారు. ‘కెనడార్మ్‌2’ రోబోటిక్‌ చేయి ఐఎ్‌సఎ్‌సలో 25ఏళ్లుగా సేవలందిస్తోంది. ఐఎ్‌సఎ్‌సకు వచ్చే రవాణా నౌకలను పట్టుకోవడానికి, భారీ పరికరాలను ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చడానికి ఇది చాలా కీలకమైనది. అయితే, మే 27న ఈ చేయిలోని ఓ జాయింట్‌ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ జాయింట్‌ను మార్చాలని నిర్ణయానికి వచ్చిన నాసాఇటీవల స్పేస్‌వాక్‌ 95 మిషన్‌ను చేపట్టింది. క్రిస్‌, జెస్సికాలతో పాటు మరో ఇద్దరిని ఐఎ్‌సఎ్‌సకు పంపించింది. మంగళవారం క్రిస్‌, జెస్సికా ఐఎ్‌సఎస్‌ యొక్క క్వెస్ట్‌ ఎయిర్‌లాక్‌ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్‌ చేస్తూ 90కిలోల బరువు ఉన్న కొత్త జాయింట్‌ను రోబోటిక్‌ చేతికి అమర్చారు. పాతదాన్ని తొలగించి ఐఎ్‌సఎ్‌సలో భద్రపర్చారు. క్రిస్‌కు ఇది రెండో స్పేస్‌వాక్‌ కాగా, జెస్సికాకు ఐదోది. కాగా, కొత్తగా అమర్చిన జాయింట్‌ బాగా పనిచేస్తోందని నాసా వెల్లడించింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement