• Jul 26, 2026
  • NPN Log

    ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పుడు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారని, అందుకే భారీ సైనిక దాడులు చేపట్టాలా లేదా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. 'ఇరాన్ ముందున్న రెండు మార్గాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం, లేకపోతే మరింత తీవ్రమైన సైనిక చర్యలను ఎదుర్కోవడం. ప్రస్తుతం వారు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారు. చర్చలు కొనసాగుతున్నందున దౌత్య పరిష్కారానికి అవకాశాన్ని పూర్తిగా మూసివేయలేదు' అని ట్రంప్ పేర్కొన్నారు.

    కాగా, శుక్రవారం ట్రంప్ తన భద్రతా సలహాదారులతో ఇరాన్‌పై విస్తృత స్థాయి సైనిక చర్యలపై చర్చించినట్లు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నందున ఇరాన్‌పై భారీ దాడుల గురించి ఆలోచించడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement