టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కి ఈశ్వరమ్మ లేఖ.. ఎందుకంటే
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కి యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. 24 పేజీలతో ఈ లేఖ రాశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జక్కిడి శివ చరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోకపోవడంతో తనపై బీసీ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందని లేఖలో పేర్కొన్నారు.
జక్కిడి శివ చరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఆయనకు గన్‌మెన్‌ను కేటాయించారని ఈశ్వరమ్మ యాదవ్ తెలిపారు. బాధితులమైన తమకు రక్షణ కల్పించాల్సింది పోయి అతనికి గన్‌మెన్‌ను కేటాయిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ విషయంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన సర్వే సత్యనారాయణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, భార్గవ్ దేశ్ పాండే, యూత్ కాంగ్రెస్ లీడర్ రాఘవేంద్ర గౌడ్‌లను సస్పెండ్ చేశారని ప్రస్తావించారు. తక్షణమే జక్కిడి శివ చరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఈశ్వరమ్మ యాదవ్ డిమాండ్ చేశారు.










Comments