డిప్లొమా కోర్సులకు కొత్త కరిక్యులమ్
అమరావతి : సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటీఈటీ) డిప్లొమా కోర్సుల్లో కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకొస్తోంది. కొత్త కరిక్యులమ్‌ను ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్‌గుప్తా మంగళగిరిలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సి-26 కరిక్యులమ్ రూపొందించామన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, పరిశ్రమల అవసరాలు, విద్యా ఫలితాలు, ఎన్‌బీఏ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని 50 మంది అకడమిక్ నిపుణులు, 108 మంది పరిశ్రమల నిపుణులు, 316 మంది సబ్జెక్టు నిపుణుల భాగస్వామ్యంతో దీనిని రూపొందించినట్లు తెలిపారు.










Comments