• Jul 26, 2026
  • NPN Log

    భారత అంతరిక్ష చరిత్రలో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఒక కొత్త శకానికి నాంది పలికింది. ప్రైవేట్‌ రంగంలో తయారైన తొలి ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మిషన్‌ ఆగమన్‌ పేరిట చేపట్టిన ఈ ప్రయోగం పది ‘తొలి’ ఘనతలు సాధించింది.

    1. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ విక్రమ్‌-1.

    2. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్‌ రంగం రాకను సూచిస్తూ భారత స్పేస్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ చేపట్టిన తొలి ప్రయోగం ‘మిషన్‌ ఆగమన్‌’.

    3. ఉక్కు కంటే దృఢంగా, అత్యంత తేలికగా ఉండే పూర్తి కార్బన్‌ కంపోజి ట్‌ మిశ్రమాన్ని దేశంలోనే తొలిసారిగా ఉపయోగించారు.

    4. విక్రమ్‌-1లోని ఆర్బిటల్‌ అడ్జె్‌స్టమెంట్‌ మాడ్యూల్‌ పూర్తిగా 3డీ ప్రింటెడ్‌ లిక్విడ్‌ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఒక భారతీయ రాకెట్‌లో ఇటువంటి ఇంజన్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి.

    5. విక్రమ్‌-1 మొదటి దశ మనదేశంలోనే అతి పొడవైన మోలోలిథిక్‌ కార్బన్‌ కాంపోజిట్‌ రాకెట్‌ దశ. ఇది స్వదేశీ కాంపోజిట్‌ తయారీ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో భారత్‌ సాధించిన పురోగతికి నిదర్శనం.

    6. రాకెట్‌ దశలను, పేలోడ్‌లను సురక్షితంగా వేరు చేసే సమయంలో అతి తక్కువ షాక్‌ (ప్రకంపనలు) కలిగించే న్యుమాటిక్‌ సెపరేషన్‌ సిస్టమ్‌ను ఉపయోగించడం దేశంలోనే మొట్టమొదటిసారి.

    7. అంతరిక్ష శిథిలాల తొలగింపు కోసం కాస్మోసర్వ్‌ సంస్థ రూపొందించిన ‘ఎంబ్రేస్‌’ అనే రోబోటిక్‌ ఆర్మ్‌ సాంకేతికతను తొలిసారి ప్రదర్శించారు.

    8. డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, సర్‌ సి.వి. రామన్‌, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం సూక్ష్మ శిల్పాలు ఉన్న బుల్లి బంగారు రాకెట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లడం ద్వారా దిగ్గజ శాస్త్రవేత్తలకు సూక్ష్మ కళా నివాళి అందించిన తొలి ప్రయోగంగా నిలిచింది.

    9. కాస్మోస్‌ డైమండ్స్‌ సంస్థ ప్రయోగశాలలో సృష్టించిన కాస్మిక్‌ బ్లూమ్‌ వజ్రాన్ని ఆర్టిస్టిక్‌ పేలోడ్‌గా మోసుకెళ్లిన తొలి రాకెట్‌ ఇదే.

    10. ప్రధాని మోదీ తన స్వహస్తాలతో ‘వందేమాతరం’ అని రాసి పంపిన ప్రత్యేక పోస్టుకార్డును కూడా ఈ రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement