• Jul 26, 2026
  • NPN Log

    బులియన్‌ మార్కెట్లో పతనం కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పసిడి ధర దేశీయ మార్కెట్లో 25 శాతం పడిపోయింది. ఇందులో దాదాపు 3 శాతం గత వారం నష్టపోయింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలి మి (24క్యారట్స్‌) బంగారం రూ.1.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్లో గత మూడు వారాల్లో 10 గ్రాముల పసిడి ధర ఇంత కనిష్ఠ స్థ్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఈ పతనం ఇంతటితో ఆగకపోవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.

    ఎందుకంటే?

    అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. గత కొద్ది రోజుల్లోనే బ్యారల్‌ ముడి చమురు ధర 14 శాతం పెరిగిపోయింది. దీంతో సెప్టెంబరులో జరిగే భేటీలో అమెరికా కేంద్ర బ్యాంక్‌..ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తప్పకుండా వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే పెట్టుబడి లాభాల కోసం చూస్తే ఇన్వెస్టర్లు పెద్దగా రాబడులు లేని బంగారాన్ని వదిలిపెట్టి.. చెల్లింపులకు ఢోకా లేకుండా అధిక వడ్డీ ఆదాయాన్ని ఇచ్చే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల వైపు మళ్లుతారని భావిస్తున్నారు.

    షార్ట్‌ సెల్లింగ్‌

    ప్రస్తుతం అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్లోనూ షార్ట్‌ సెల్లింగ్‌ పెరిగింది. స్వల్పకాలిక లాభాల కోసం బంగారం కొనుగోలు చేసిన మదుపరులు.. ధర ఇంకా ఎంత పడిపోతుందోననే భయంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మకానికి పెడుతున్నారు. ‘పసిడి ధర తగ్గుతున్నపుడు, లాభాల స్వీకరణ కోసం షార్ట్‌ సెల్లర్లు పసిడి అమ్మకాలకు దిగడం సహజం’ అని ఫారెక్స్‌.కామ్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ ఫవాద్‌ రజాక్‌జాదా అన్నారు. ముడి చమురు ధర పెరిగే కొద్దీ ఈ అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా.

    ఈ పతనం ఎందాక?

    ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.1.45 లక్షల వరకు పలుకుతోంది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో అయుతే మరింత బోసిపోతోంది. శుక్రవారం ఆగస్టులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం మల్టీ కమోడిటీస్‌ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌) లో రూ.248 నష్టపోయి రూ.1,40,100 వద్ద ముగిసింది. న్యూయార్క్‌లోని ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ ఔన్స్‌ (31.10 గ్రాములు) పసిడి 3,985.52 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో దసరా, దీపావళి నాటికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.1.30 లక్షల నుంచి రూ.1.35 లక్షల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    పశ్చిమాసియా తాజా సంక్షోభంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయంతో గత వారం పసిడి ధర 2 శాతం, వెండి ధర 6 శాతానికి పైగా నష్ట పోయాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement