• Jul 26, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : సెల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి వీలుగా భార త ప్రభుత్వం టెలికాం ఆపరేటర్‌ బీఎస్ఎన్ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. భారతీయ వాతావరణానికి తగ్గట్లుగా దానిని రూపొందిచినట్లు సంస్థ పేర్కొంది. ఎక్కువ సమయం బ్యాటరీ వచ్చేలా, తీవ్ర వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునేలా, వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌలభ్యంతో ఫోన్‌ను రూపొందించినట్లు సంస్థ వివరించింది. భూ స్థిర ఉపగ్రహాల ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌ సంస్థ ఇన్మార్సాట్‌ సహభాగస్వామ్యంతో ఈ శాటిలైట్‌ ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు బీఎస్ఎన్ఎల్‌ పేర్కొంది. అన్ని రకాల పన్నులతో కలుపుకొని ఈ ఫోన్‌ ధర రూ.1,34,166. మన దేశంలో శాటిలైట్‌ ఫోన్‌ను సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కొనుగోలు చేసి వాడుకోవడం కుదరదు. ఫోన్‌ కొనుగోలు చేయాలన్నా, వాడాలన్నా టెలికమ్యూనికేషన్స్‌ శాఖ అనుమతి తప్పనిసరి. శాటిలైట్‌ ఫోన్‌ సర్వీసు గురించి మరిన్ని వివరాలకోసం దగ్గరలోని సంస్థ కార్యాలయాలను సందర్శించాలని లేదా 9768866652కు కాల్‌ చేయాలని కోరింది. కాగా, బీఎస్ఎన్ఎల్‌ ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 99,000 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. మరిన్ని టవర్లను కూడా ఏర్పాటు చేయనుంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement