• Jul 26, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: బాస్‌ స్కామ్‌పై అప్రమత్తంగా ఉండాలని లిస్టెడ్‌ కంపెనీలు, తన నియంత్రణ పరిధిలోని సంస్థలను క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కోరింది. తాము చెప్పిన బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయాలని కంపెనీల ఎండీలు, సీఈఓల్లా నటిస్తూ కొందరు కేటుగాళ్లు పంపే ఈ-మెయిల్స్‌, వాట్సప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే మెసేజ్‌లను ఏమాత్రం నమ్మవద్దని కోరింది. క్షుణ్ణంగా చెక్‌ చేసుకోకుండా వారి మాటలు, మెసేజ్‌లను నమ్మి నిధులు బదిలీ చేస్తే నిండా మునగడం ఖాయమని హెచ్చరించింది. ఇటీవల సైబర్‌ కేటుగాళ్లు కంపెనీల ఎండీలు, సీఈఓల్లా నటిస్తూ, తాము చెప్పే బ్యాంకు ఖాతాలకు వెంటనే నిధులు బదిలీ చేయాలని ఆయా కంపెనీల ఫైనాన్స్‌ లేదా అకౌంట్స్‌ విభాగాల్లోని ఉన్నతాధికారులకు ఈ-మెయిల్స్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మెసేజ్‌లు పంపిస్తూ నిలువునా దోచేస్తున్నారు. ఒక్కోసారి ఆయా కంపెనీల ఎండీలు, సీఈఓల వాయి్‌సను సైతం క్లోన్‌ చేసి ఫోన్‌ చేసి మరీ బురిడీ కొట్టిస్తున్నారు. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఇలా మోసపోతే వెంటనే సైబర్‌ క్రైమ్స్‌ పోర్టల్‌ లేదా 1930 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది. బాస్‌ స్కామ్‌గా పిలిచే ఈ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సెబీ ఈ హెచ్చరిక చేసింది.

    ‘డీమ్యాట్‌’ యూనిట్లకూ స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ సౌలభ్యం: మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) పథకాల యూనిట్ల మదుపరులకు సెబీ మరో శుభవార్త చెప్పింది. డీమ్యాట్‌ ఖాతాల్లోని సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (ఎస్‌టీపీ) యూనిట్లకు కూడా స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది జనవరి 31 లోపు, ఏప్రిల్‌ 30 లోపు రెండు దశల్లో ఈ మార్పులు అమలు చేయాలని సెబీ కోరింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement