• Jul 26, 2026
  • NPN Log

    వాషింగ్టన్‌ : భూకంపం మొదలయ్యే కొన్ని సెకన్ల ముందు ప్రజల్ని హెచ్చరించే వ్యవస్థను చాలా దేశాలు అభివృద్ధి చేశాయి. ఇలాంటి ఎర్లీ ఎర్త్‌క్వేక్‌ వార్నింగ్‌(ఈఈడబ్ల్యూ) వ్యవస్థలు లేని వెనెజువెలా వంటి దేశాల్లో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ భూకంప హెచ్చరికలు ఉపయోగపడుతున్నాయి. తాజా భూకంపం సమయంలో లక్షలాది మంది మొబైల్‌ ఫోన్లకు వార్నింగ్‌ మెసేజ్‌లు వచ్చాయి. కొద్ది సెకన్ల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు అవకాశం దక్కింది. భూకంప తరంగాలను గుర్తించే సెల్‌ఫోన్స్‌ సెన్సార్‌ డేటాపై ఆ హెచ్చరికల వ్యవస్థ ఆధారపడి పనిచేస్తుంది. 2020లో దీనిని ప్రారంభించినప్పుడు ఆ ఏడాది 25 కోట్ల మంది హెచ్చరికలు అందుకున్నారని, ప్రస్తుతం ఆ సంఖ్య 250 కోట్ల మందికి చేరిందని బర్కిలీ సీస్మాలజీ ల్యాబ్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ అల్లెన్‌ చెప్పారు. ప్రతినెల సగటున 60 భూకంపాల గురించి 1.8 కోట్ల ఫోన్లకు హెచ్చరికలు పంపుతున్నట్లు తెలిపారు. భాకంపాలపై ప్రజల్ని నేరుగా హెచ్చరించే ఈఈడబ్ల్యూ వ్యవస్థను 1991లో మెక్సికోలో మొదలుపెట్టారు. 2011లో సునామీ ముంచెత్తిన తర్వాత తన భూకంప హెచ్చరికల వ్యవస్థను జపాన్‌ మరింత బలోపేతం చేసింది. సముద్రంలో వేల మైళ్లు కేబుళ్లు, సెన్సార్లు ఏర్పాటు చేసి టెక్టానిక్‌ ప్లేట్ల కదలికలను నేరుగా కనుగొనేలా ఆ వ్యవస్థను విస్తరించింది. దీనివల్ల 20 సెకన్ల ముందే భూకంపాన్ని గుర్తించే అవకాశంతో పాటు 20 నిమిషాలు కంటే ఎక్కువ వేగంగా సునామీ హెచ్చరికలను జారీ చేసే అవకాశం ఉంది. ఇక అమెరికా జియలాజికల్‌ సర్వే కాలిఫోర్నియా, ఓరెగాన్‌, వాషింగ్టన్‌ కోసం షేక్‌అలర్ట్‌ పేరుతో హెచ్చరికల వ్యవస్థను నిర్వహిస్తోంది. వివిధ రకాలుగా హెచ్చరికలు పంపుతుంది. దీనిలో కాలిఫోర్నియాలో మైషేక్‌ యాప్‌ ద్వారా హెచ్చరికలు పంపుతారు. దీన్ని 2019లో దీన్ని ప్రారంభించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement