• Jul 26, 2026
  • NPN Log

    వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను విధిస్తున్నారు. వెట్టిచాకిరీ కార్మికుల ద్వారా ఉత్పత్తైన వస్తువులపై నిషేధాజ్ఞలను సరిగ్గా అమలు చేయలేదని ఆరోపిస్తూ.. చైనా, యూకే సహా సుమారు 60 అమెరికా వాణిజ్య భాగస్వాములపై ​ఈ టారిఫ్స్ విధించారు ట్రంప్. ఆయా దేశాల దిగుమతులపై యూఎస్ 10 శాతం నుంచి 12.5 శాతం వరకు పన్నులు విధిస్తోంది. అమెరికన్లు దిగుమతులపై అతిగా ఆధారపడటాన్నీ తగ్గించేందుకు ట్రంప్ చేపట్టిన విస్తృత చర్యల్లో ఇదో భాగమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    కాగా.. సుప్రీంకోర్టులో ఓటమి తర్వాత ట్రంప్ విధించిన తాత్కాలిక సుంకాల గడువు నేటి(శుక్రవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఊహించినట్టుగానే ఈ ప్రకటన వెలువడింది. ఈ టారిఫ్స్ విధానం నేటి నుంచే అమల్లోకి రానున్నట్టు యూఎస్ వెల్లడించింది. అధిక వేతనాలు పొందే యూఎస్ కార్మికులు తయారుచేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా.. వెట్టిచాకిరీ కార్మికులతో ఉత్పత్తైన వస్తువుల దిగుమతిని నిషేధించే చట్టంలేని చైనా, యూకే, జపాన్ వంటి దేశాలు 12.5 శాతం సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని వైట్‌హౌస్ తన ఉత్తర్వులో పేర్కొంది. అయితే.. యూఎస్, మెక్సికో, కెనడా ఒప్పందం పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు, చమురు, గ్యాస్ వంటి కొన్ని దిగుమతులకు కొత్త సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది.

    భారత్‌పై సుంకాలు

    ట్రంప్ తాజా చర్యతో భారత్‌పై ఎలాంటి ప్రభావం లేనట్టే తెలుస్తోంది. గతంలో విధించిన 10 శాతం సుంకం విధానం యథావిధిగా కొనసాగనుంది. సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో జరిపిన విచారణ అనంతరం ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రామాణిక 10 శాతం గ్లోబల్ సర్‌ఛార్జ్‌, భారత్ నుంచి అమెరికాకు జరిగే దిగుమతులపై వర్తిస్తుంది. అది నేటితో ముగియనుంది. కానీ.. కంబోడియా, గ్వాటెమాల, హోండురాస్, భారత్, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి కొన్ని ఆర్థిక వ్యవస్థలు వెట్టిచాకిరీ కార్మిక దిగుమతులపై నిషేధాన్ని విధిస్తున్నందున వాటికి యథావిధిగానే సుంకాల అమలు వర్తించనుందని యూఎస్ తన తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఓ నివేదిక ప్రకారం.. అదనపు తయారీ సామర్థ్యానికి సబ్సిడీలు ఇచ్చే దేశాల నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం కొన్ని వారాల్లోనే మరో విడత సుంకాలను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా.. ప్రపంచ మార్కెట్లలో అమెరికా కంపెనీలు పోటీపడలేని విధంగా తక్కువ ధరల ఉత్పత్తులు వెల్లువెత్తుతాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement