సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్8 ఫోన్ల ఆవిష్కరణ
లండన్: దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం సామ్‌సంగ్.. ఎనిమిదో తరం ఫోల్డబుల్ ఫోన్లను బుధవారం లండన్‌లో ఆవిష్కరించింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అలా్ట్ర, గెలాక్సీ జెడ్ ఫోల్డ్8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్8 పేర్లతో విడుదల చేసిన ఈ కొత్త ఫోన్లు గత మోడళ్లతో పోలిస్తే మరింత సన్నగా, తేలికగా ఉండటంతో పాటు మరింత పెద్ద స్ర్కీన్‌ను, ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా మార్కెట్లో వీటి ధరల శ్రేణి మోడల్, వేరియంట్ ఆధారంగా రూ.1.25 లక్షల నుంచి రూ.2.60 లక్షల స్థాయిలో ఉంది. భారత కస్టమర్లకు ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్ సౌకర్యం బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభం కాగా.. ఆగస్టు 7న మార్కెట్లోకి ఫోన్లు అందుబాటులోకి వస్తాయి.










Comments