• Jul 26, 2026
  • NPN Log

    చెన్నై : సీబీఎ్‌సఈ పాఠ్యప్రణాళికలో భాగంగా తొమ్మిదో తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల బోర్డు పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి స్థాయి పెరుగుతుందని చెప్పింది. 5 లేదా 6 తరగతుల్లో దానిని ప్రవేశపెడితే విద్యార్థులు అలవాటు పడటానికి అవకాశం ఉంటుందని సూచించింది. మూడో భాషను తొమ్మిదో తరగతిలో ప్రవేశపెట్టవద్దని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ల ధర్మాసనం గురువారం కేంద్రాన్ని మౌఖికంగా కోరింది. ‘‘మీరు కొత్త భాషను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తే దానిని 5 లేదా 6వ తరగతి నుంచి మొదలు పెట్టండి. 9లో ప్రవేశపెట్టవద్దు. 8వ తరగతి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతుంది. 9లో పూర్తి ఒత్తిడి ఉంటుంది. కొత్త భాష వల్ల వారు మరింత ఒత్తిడికి లోనవుతారు’’ అని కేంద్రం తరఫున హాజరైన న్యాయవాదికి జస్టిస్‌ నాగరత్న చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు కోర్టు ఉద్దేశాన్ని తీసుకెళ్లాలని సూచించారు. విచారణను ఆగస్టు 11కి వాయిదా వేశారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement