• Jul 26, 2026
  • NPN Log

    పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన కాల్పుల విరమణ  ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ప్రతిపాదనను ఇరాక్ ప్రధానమంత్రి ద్వారా టెహ్రాన్‌కు చేరవేసినట్టు సమాచారం. అయితే, ఈ తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించలేదని నివేదికలు పేర్కొన్నాయి.

    కొద్ది రోజులపాటు యుద్ధాన్ని నిలిపివేయడం సమస్యకు పరిష్కారం కాదని ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో అమెరికా లేదా దాని మిత్రదేశాల నుంచి మళ్లీ దాడులు జరగవని స్పష్టమైన భద్రతా హామీలు, శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీసే రాజకీయ చర్చలు అవసరమని టెహ్రాన్ పేర్కొన్నట్లు సమాచారం.

    యుద్ధాన్ని తాత్కాలికంగానైనా నిలిపివేయాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరాన్ మాత్రం ముందుగా దీర్ఘకాలిక పరిష్కారానికి హామీలు కావాలని పట్టుబడుతోంది. దీంతో మధ్యవర్తిత్వ చర్చలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement