• Jul 26, 2026
  • NPN Log

    వాషింగ్టన్/టెహ్రాన్ : ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు తమ దాడిని మరింత ఉధృతం చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్  వెల్లడించిన వివరాల ప్రకారం, యూఎస్ దళాలు వరుసగా 13వ రోజు రాత్రి కూడా ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించాయి.

    నౌకాదళ దిగ్బంధం.. వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయం

    అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6:45 గంటలకు ఈ దాడుల పర్వం ప్రారంభమైంది. 'ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) నుంచి అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ముప్పును నివారించడం, ఇరాన్‌ను జవాబుదారీగా చేయడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని CENTCOM స్పష్టం చేసింది. గత తొమ్మిది రోజులుగా పునఃప్రారంభించిన నౌకాదళ దిగ్బంధం  ద్వారా ఇరాన్ రేవుల్లోకి ప్రవేశించకుండా లేదా బయటకు వెళ్లకుండా ఇప్పటివరకు 12 వాణిజ్య నౌకలను దారి మళ్లించగా, ఒక నౌకను పూర్తిగా నిరోధించినట్లు అమెరికా అధికారులు తెలిపారు.

    నష్టపరిహారం ఇరాన్ సొమ్ము నుంచే: డొనాల్డ్ ట్రంప్

    ఈ దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్'   ఖాతా ద్వారా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఇప్పటి నుంచి నౌకలకు, సరకు రవాణాకు లేదా వాటికి సంబంధించిన దేనికైనా నష్టం వాటిల్లితే... ఆ నష్టపరిహారాన్ని అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ సొమ్ము నుంచే వసూలు చేయడం జరుగుతుంది. ఇది అత్యంత న్యాయమైన, నిష్పాక్షికమైన చర్య'అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

    'అణు ఆయుధాలను అస్సలు సహించం'

    ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని పొందేందుకు వీల్లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్.. అణు ఆయుధాల గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదని, ప్రతీకార చర్యలకు వారు సిద్ధంగా లేరని ట్రంప్ చెప్పారు. ఈ చర్యను గతంలోనే ఇతర అమెరికా అధ్యక్షులు లేదా ఇతర దేశాలు చేసి ఉండాల్సిందని, వేరే ఎవరూ చేయలేకపోయిన పనిని తాము చేసి చూపిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement