• Jul 26, 2026
  • NPN Log

    ఉక్రెయిన్‌లోని ఒడెసా  నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించింది. గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌక ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో దాడికి గురైంది. నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. ఈ దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా, మరో భారతీయుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

    రష్యా ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు ఈ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతింది. ఇటీవల నల్ల సముద్రం  ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ దాడులు తీవ్రం కావడంతో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. నల్ల సముద్రంలోని పోర్టులు, వాణిజ్య నౌకలు తరచూ దాడులకు గురవుతున్నాయి.

    ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, అమాయక పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన భారతీయుడికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement