• Jul 26, 2026
  • NPN Log

    ఒంగోలు : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల జిల్లాల పునర్విభజనలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగా ర్థులకు ఊరట లభించింది. ప్రభుత్వంలో విలీనమైన తేదీ కాకుండా ఎయిడెడ్‌లో సర్వీసు ప్రారంభమైన తేదీ నుంచి వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎయిడెడ్‌ టీచర్లు, సిబ్బందికి న్యాయం జరిగినట్లు అయింది. ఎయిడెడ్‌లో పిల్లలు లేని పాఠశాలలను మూసివేసి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గట్టి ప్రయత్నం జరిగింది. అప్పట్లో వందలాది పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడి టీచర్లు, సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేశారు. అప్పటి నుంచి వారు ప్రభుత్వ టీచర్లు, సిబ్బందిగానే పరిగణిస్తున్నారు.

    హైకోర్టుకు ఉపాధ్యాయులు

    బదిలీల విషయంలో వీరి మొత్తం సర్వీసు (ఎయి డెడ్‌తో కలిపి)కు పాయింట్ల కేటాయించే వారు. స్టేషన్‌ పాయింట్లు మాత్రం వారు ఆ పాఠశాలలో చేరిన తేదీ నుంచి పరిగణించే వారు. ప్రమోషన్లలో మాత్రం వారు ప్రభుత్వంలో విలీనమైన తేదీని సీనియారిటీ లెక్కింపు నకు ప్రామాణికంగా తీసుకునేవారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల జిల్లాల విభజనకు ప్రమోషన్‌ సీనియారిటీ జాబితాలను ప్రామాణికంగా తీసుకుంటుండటంతో ఎయిడెడ్‌ ఉద్యోగులు సీనియారిటీ కోల్పోయి జూనియర్లుగా మిగిలి నష్టపోతున్నారు. విభజనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారికి న్యాయం జరగలేదు. దీంతో విభజనలో సీనియారిటీ విషయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. వీరి విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వీరికి న్యాయం చేస్తూ వీరు ఎయిడెడ్‌ సర్వీసులో చేరిన నాటి నుంచి సీనియారిటీని పరిగణించాలని ఆదేశాలు జారీచేయడంతో ఎయిడెడ్‌ టీచర్లు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement