• Jul 26, 2026
  • NPN Log

    ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 12.2 శాతం వృద్ధితో రూ.7,769 కోట్లకు చేరకుంది. ఈ ఏప్రిల్‌ క్వార్టర్‌లో నమోదైన రూ.8,501 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 8.6 శాతం తగ్గింది. కాగా, ఈ క్యూ1లో సంస్థ ఆదాయం 14 శాతం పెరిగి రూ.48,211 కోట్లుగా నమోదైంది. అయితే, 2026-27 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయ వృద్ధి అంచనా శ్రేణిని మాత్రం గతంలో ప్రకటించిన 1.5-3.5 శాతం నుంచి 1.5-3 శాతానికి కుదించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ఇతర భౌగోళిక రాజకీయ అనిశ్చితులను ఇందుకు కారణంగా పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు..

    గడిచిన మూడు నెలల్లో కంపెనీ 360 కోట్ల డాలర్ల విలువైన భారీ ఆర్డర్లను దక్కించుకుంది.

    మొత్తం ఆదాయంలో ఏఐ రెవెన్యూ వాటా 8.2 శాతానికి పెరిగినట్లు కంపెనీ తెలిపింది.

    జూన్‌ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల మొత్తం సంఖ్య 532 తగ్గి 3,28,062కు పరిమితమైంది. ఈ ఏప్రిల్‌ తో ముగిసిన త్రైమాసికంలో 12.6 శాతంగా నమోదైన ఉద్యోగుల వలసల రేటు.. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 13 శాతానికి పెరిగింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ మరోసారి తెలిపింది. జూన్‌ త్రైమాసికంలో 4,000 మంది ఫ్రెషర్స్‌ను చేర్చుకున్నట్లు తెలిపింది.

    ఉద్యోగుల జీతాలను రెండు విడతల్లో (ఈ ఏడాది అక్టోబరు, 2027 జనవరి) పెంచనున్నట్లు ఇన్ఫోసిస్‌ సీఈఓ పరేఖ్‌ తెలిపారు. చాలావరకు ఉద్యోగులకు అక్టోబరులో, సీనియర్లకు జనవరిలో పెంచనున్నట్లు వెల్లడించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement