• Jul 26, 2026
  • NPN Log

    ఇరాన్‌లోని పిక్‌యాక్స్ అణు శుద్ధి కేంద్రంపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక జారీ చేశారు. దీంతో, మరోసారి కలకలం రేగుతోంది. అయితే, అసలు ఈ అణుకేంద్రంపై దాడి సాధ్యమేనా? ఇందుకు తగిన ఆయుధాలు యూఎస్ వద్ద ఉన్నాయా? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

    పిక్‌యాక్స్ అణు శుద్ధి కేంద్రం ప్రత్యేకత ఇదీ..

    పిక్‌యాక్స్ అనే పర్వతం అడుగున భూగర్భంలో 100 మీటర్ల లోతున ఈ అణుకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా నిర్మాణ పనులు అక్కడ కొనసాగుతున్నాయి. ఇరాన్‌లోని ప్రధాన నటాన్జ్ న్లూక్లియర్ కాంప్లెక్స్‌కు దక్షిణా 2 కిలోమీటర్ల దూరంలో ఈ అణుకేంద్రం ఉంది. 2020లో నటాన్జ్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీని వెనుక కుట్ర ఉందని భావించిన ఇరాన్ ప్రభుత్వం పిక్‌యాక్స్ పర్వతం అడుగున అణుశుద్ధి కేంద్రం ఏర్పాటును ప్రారంభించింది. అక్కడ ఇంకా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కేంద్రం చుట్టూ పలు గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇరాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక దళం ఐఆర్‌జీసీ కూడా గట్టి పహారా కాస్తోంది. అసలు ఈ కేంద్రంలో ఏమి దాగుందనే విషయాలపై కూడా పూర్తి స్పష్టత లేదు. అయితే, అణు శుద్ధికి కావాల్సిన సెంట్రిఫ్యూజ్‌ పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని 2020లో ఇరాన్ పేర్కొంది.

    పిక్స్‌యాక్స్ కేంద్రంపై దాడి చేసేందుకు అమెరికా తన వద్ద ఉన్న జీబీయూ-57 బాంబును ప్రయోగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూగర్భంలో దాగున్న ఇలాంటి కేంద్రాలను ధ్వంసం చేసేందుకే అమెరికా ఈ క్షిపణిని అభివృద్ధి చేసుకుంది. ఇది భూగర్భంలో దాగున్న కేంద్రాలను ధ్వంసం చేయగలదు. రెండు క్షిపణులను ఒకదాని వెంట మరొకటి పిక్‌యాక్స్ కేంద్రంపై గురిపెడితే అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడం సాధ్యమని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసలు ఈ వ్యూహం ఫలిస్తుందా? ఇందుకు జీబీయూ-57 సామర్థ్యం సరిపోతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement