• Jul 26, 2026
  • NPN Log

    ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 964.58 పాయింట్లు (1.25 శాతం) ఎగబాకి 78,151.45 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 261.55 (1.09 శాతం) పాయింట్ల వృద్ధితో 24,334.30 వద్ద ముగిసింది. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు బ్యాంకింగ్‌, ఐటీ రంగాలకు చెందిన ప్రధాన కంపెనీల షేర్ల (బ్లూచి్‌ప్స)లో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లకు దిగటం ఇందుకు దోహదపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 రాణించాయి. టెక్‌ మహీంద్రా షేరు 3.91 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కోటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ సైతం 3 శాతానికి పైగా పుంజుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2.59 శాతం, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఒక శాతానికి పైగా పెరిగాయి. దాంతో, బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మాత్రం కేవలం రూ.38,000 కోట్ల పెరుగుదలతో రూ.480.92 లక్షల కోట్లు (4.99 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి రూ.96.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కె ట్లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారల్‌ ధర ఒకదశలో 1.79 శాతం పెరిగి 85.52 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

    ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.800 తగ్గి మూడు వారాల కనిష్ఠ స్థాయి రూ.1,45,500కు జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.2,000 తగ్గుదలతో రూ.2,22,500కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాము లు) బంగారం 4,000 డాలర్ల దిగువకు పడిపోగా.. సిల్వర్‌ 55 డాలర్లకు దిగివచ్చింది.

    ఈ నెల 10తో ముగిసిన వారంలో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు 96.4 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 67,515.7 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement