• Jul 26, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : లారస్‌ ల్యాబ్స్‌.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం ఏకంగా 126 శాతం వృద్ధితో రూ.368 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.163 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 29 శాతం వృద్ధితో రూ.1,570 కోట్ల నుంచి రూ.2,026 కోట్లకు చేరుకుంది. అఫర్డబుల్‌ మెడిసిన్స్‌ పోర్టుఫోలియో (జెనరిక్స్‌) విభాగం మంచి పనితీరును కనబరచటంతో పాటు, సీడీఎంఓలో వాణిజ్యపరమైన డెలివరీలు పెరగటం ఎంతగానో కలిసివచ్చిందని లారస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. జూన్‌ త్రైమాసికంలో సీడీఎంఓ విభాగం ఆదాయాలు 67 శాతం వృద్ధితో రూ.522 కోట్ల నుంచి రూ.870 కోట్లకు పెరగగా.. జెనరిక్స్‌ విభాగం ఆదాయం రూ.1.048 కోట్ల నుంచి రూ.1,156 కోట్లకు పెరిగింది. కాగా ఈ కాలంలో ఆర్‌ అండ్‌ డీ పెట్టుబడులు రూ.118 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. వైజాగ్‌ ప్లాంట్‌లో ఏపీఐ,ఫెర్మెంటేషన్‌ సామర్థ్యాలను పెంచేందుకు పెట్టుబడులను కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement