• Jul 26, 2026
  • NPN Log

    శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A18 ఫోన్‌ అతి త్వరలో లాంచ్ కానుంది. వచ్చే నెలలో శాంసంగ్ A18 ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా. తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లతో రాబోతుంది. గత ఏడాది ఆగస్టులో కంపెనీ లాంచ్ చేసిన గెలాక్సీ A17 5జీ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది. ఇప్పుడు, శాంసంగ్ గెలాక్సీ A18 రెండర్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ డిజైన్‌, పూర్తి ఫీచర్లపై ఓసారి పరిశీలిద్దాం.. శాంసంగ్ గెలాక్సీ A18 త్వరలో లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ A17కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తుందని అంచనా. ఈ ఫోన్ రెండర్‌లు లీక్ అయ్యాయి. స్మార్ట్‌ఫోన్ CAD రెండర్‌లు, డిజైన్‌ను సూచిస్తున్నాయి. ఫోన్ కొలతలు కూడా రివీల్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ A18 ఫోన్ 7.84mm మందంతో ఉంటుందని అంచనా. డిస్‌ప్లే, డిజైన్ విషయానికి వస్తే.. కంపెనీ ఇన్ఫినిటీ-యు నాచ్ డిజైన్‌నే కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

    ఈ రెండర్‌లు శాంసంగ్ గెలాక్సీ A18 ఫోన్ మొత్తం డిజైన్ దాదాపు ఒకేలా ఉంటుంది. ఈ ఫోన్ కొలతలు 164.4 x 77.8 x 7.84mmగా ఉంటాయని సూచిస్తున్నాయి. బ్యాక్ డిజైన్‌లో క్యాప్సల్ షేప్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరాలు ఉంటాయి. ఎంట్రీ-లెవల్ ఫోన్ కంపెనీ బ్యాక్ డిజైన్‌లో కొత్తదనం లేదు. బెజెల్స్ కొద్దిగా సన్నగా ఉండవచ్చు. కానీ, అందులో కూడా భారీ మార్పు ఉండదని అంచనా.

     

     

    నివేదికల ప్రకారం..
    ఈ ఫోన్ క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో రన్ అవుతుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 కావచ్చు. ఈ చిప్‌సెట్ 6nm ప్రాసెసింగ్‌పై వస్తుంది. ఈ ఫోన్ రోజువారీ పనులతో వస్తుంది. ఈ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా.

     

     

     

    ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీ కెమెరా 13MP ఉండనుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని అంచనా. ప్రపంచ మార్కెట్లో చిప్ కొరత కారణంగా పెరిగిన ధరలతో ఈ ఫోన్ ధర పాత మోడల్ కన్నా ఎక్కువ ఉండొచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement