హెరిటేజ్ ఆదాయం రూ.1,345 కోట్లు
హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యూ1)లో హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయం ఆకర్షణీయమైన వృద్ధి రేటు నమోదు చేసింది. క్యూ1లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,344.50 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే కాలంలో నమోదైన రూ.1,142 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. ఈ ఏప్రిల్-జూన్ కాలానికి కంపెనీ రూ.24.97 కోట్ల ఏకీకృత నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే కాలంలో నమోదు చేసిన రూ.40.54 కోట్లతో పోలిస్తే ఇది 38.40 శాతం తక్కువ. క్యూ1లో ఖర్చులు 21 శాతం పెరిగి రూ.1,310.9 కోట్లకు చేరడం కంపెనీ లాభాలకు గండికొట్టింది. పాల ధర పెరగడంతో పాటు పాల కొరత కూడా పరిశ్రమను వేధించాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. అయినా పాల సేకరణ వ్యవస్థను పటిష్ఠం చేయడం, అన్ని ఉత్పత్తుల విభాగాల్లో మార్కెట్ వాటా పెంచుకోవడం, విలువ జోడింపు ఉత్పత్తుల వృద్ధి ద్వారా క్యూ1లో అడ్డంకులను అధిగమించినట్టు పేర్కొన్నారు.










Comments