అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్
చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, జమ్మూ కాశ్మీర్ తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.





Comments