వర్షాలు తగ్గడంతో ధాన్యం ఆరబెట్టి త్వరగా కొనుగోలు చేయాలని సూచించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
వర్షాలు తగ్గినందున కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టుకుని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు .రైతులు వారి ధాన్యాన్ని ఆరబెట్టుకుని సిద్ధంగా ఉన్నట్లయితే కాంటాలు వేసి మిల్లులు పంపిస్తామని చెప్పారు.
శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, అనుముల (హలియా) మండలం, రామడుగు లో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్పలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడారు.ప్రస్తుతం వర్షం తగ్గినందున ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని, 17% తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రెండు, మూడు రోజుల తర్వాత తిరిగి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున త్వరితగతిన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం సరైన తేమశాతం, నాణ్యత ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు మిల్లులకు పంపించాలని, కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ,డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ,తదితరులు ఉన్నారు.





Comments