మీ అందరి మధ్య నా స్వగ్రామం లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జరుపుకోవడం నా అదృష్టం.. ఎమ్మెల్యే
అమిలినేని
వాల్మీకి విగ్రహావిష్కరణతో గ్రామంలో పండుగ వాతావరణం కన్పిస్తోంది..
రామాయణ మహాకావ్యాన్ని రాసిన మహాకవి, మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన నాటి నుంచి ప్రతి గ్రామంలోను జయంతి వేడుకలను జరుపుకుంటున్నారని అందులో నేడు మీ అందరి సమక్షంలో పాల్గొనడం నా అదృష్టంగా బావిస్తున్నానని, జయంతి వేడుకలతో పాటు నూతన విగ్రహావిష్కరణ చేస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం కన్పిస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు..నేడు అనంతపురం జిల్లా అమిద్యాల గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ, జయంతి వేడుకలకు ముఖ్యఅతితులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులకు వాల్మీకి సోదర, సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలో వాల్మీకి సర్కిల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాల్మీకి సోదరులను అందరిని కలిపి విగ్రహావిష్కరణ ఎప్పుడు అనేది నిర్ణయిస్తామన్నారు.. జిల్లాలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా భారీ స్థాయిలో వాల్మీకి విగ్రహావిష్కరణ చేస్తామని తెలిపారు..







Comments