ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి.
నల్లగొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు





Comments