కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ పాత్ర అమోఘం – పల్లా దేవేందర్ రెడ్డి
దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. ఏఐటీయూసీ 106 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నల్లగొండ లో ఏఐటియుసి జెండాను పల్లా దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డి ఈ ఓ ఆఫీస్ వద్ద జెండా ఎగరవేసి అనంతరం జరిగిన సభలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం లో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించినదని అన్నారు. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31 న ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికుల కు అనేక సంక్షేమ చట్టాలు,హక్కులు, సాధించిన ఘనత ఏఐటీయూసీ దే అని అన్నారు. అటు స్వాతంత్ర పోరాటం మరోవైపు కార్మిక చట్టాల సాధన కోసం జరిగిన పోరాటం దేశంలో మొదటిసారిగా ఏఐటియుసి నాయకత్వంలోనే జరిగాయని అన్నారు. బ్రిటీష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే కనీస వేతనాల చట్టం, సంఘం పెట్టుకొనే హక్కును సాధించిన ఘనత ఏఐటియూసి దే అని అన్నారు.
మోడీ ప్రభుత్వం కార్మికులు పొరాడి సాధించిన 29 చట్టాల ని 4 కోడ్ లుగా మార్చి హక్కులు లేకుండా చేసి యాజమాన్యంలకు అనుకూలంగా చట్టాలు మార్పులు చేశారు అని ఆరోపించారు. నేడు కేంద్ర ప్రభుత్వం సంఘం పెట్టుకునే హక్కు లేకుండా వేతనాల కోసం సమ్మె చేసే హక్కు లేకుండా చట్టాలు మార్చడం విచారకరమని అన్నారు.దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం నిరంతరము రాజిలేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు. కాంటాక్ట్ వ్యవస్థ రద్దు కోసం కనీస వేతనాలు అమలు కోసం, ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి జిల్లా ఉపాధ్యక్షులు కే ఎస్ రెడ్డి, జిల్లా కోశాధికారి దొనకొండ వెంకన్న,డివిజన్ కార్యదర్శి విశ్వనాధుల లెనిన్ ,భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండె రవి కార్యదర్శి రేవల్లి యాదయ్య, నరసింహ,మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏం డి జానీ,కృష్ణ,,పోతురాజు నాగరాజు ,కంభంపాటి జానయ్యా,,లక్ష్మయ్య, గిరి ,వీరయ్య,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ వద్ద డి వెంకన్న సివిల్ సప్లై హమాలి యూనియన్ జెండాను కేస్ రెడ్డి ఎగరవేశారు.





Comments