68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్
తెలంగాణ : మద్యం దుకాణాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులు బారులు తీరారు. వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 68,900 అప్లికేషన్ల ద్వారా రూ.2,067 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 30 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయం రూ.3 వేల కోట్లు దాటనుంది. గతంలో 1.03 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,600 కోట్లు వచ్చాయి.
Comments