భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తిరుపతి, కడప, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
Comments