కొత్తగా 41 కాలేజీలు.. 10,650 ఎంబీబీఎస్ సీట్లు
2025-26 విద్యాసంవత్సరానికిగానూ 10,650 ఎంబీబీఎస్ సీట్లకు NMC ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 1,37,600కు చేరనుంది. వీటిలో INIకు చెందిన సీట్లూ ఉన్నాయని వెల్లడించింది. దీంతో పాటు 41 నూతన మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలపగా మొత్తం విద్యాసంస్థల సంఖ్య 816కు పెరగనుంది. అటు పీజీ సీట్లు 5వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 67వేలకు చేరే అవకాశం ఉంది.










Comments