బంగారం ధరల్లో భారీగా తగ్గుదల
బంగారం ధరల్లో భారీ స్థాయిలో కోత పడింది. పది రోజుల వ్యవధిలోనే 10 శాతం మేర తగ్గాయి. ధన త్రయోదశి సమయంలో రూ.1.30 లక్షల మార్కు దాటిన పసిడి నేడు రూ.1.20 లక్షల వద్ద తచ్చాడుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,810గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,10,740కు దిగొచ్చింది. వెండి ధరల్లో కూడా కోత పడింది. కిలో వెండి రూ.1,50,900గా ఉంది. హైదరాబాద్లో కూడా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రేటు రూ.1,20,810గా ఉంది. ఆర్నమెంటల్ బంగారం రేటు రూ.1,10,740కు దిగొచ్చింది
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ బంగారం 3941 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ వెండి ధర కూడా 47 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఈ వారంలో వెండి ధరలు 6 శాతం మేర పతనమయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణ, ధరల్లో దిద్దుబాటు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగవ్వడం వంటివన్నీ బంగారం, వెండి ధరల పరుగుకు బ్రేకులు వేస్తున్నాయి. ధరల్లో మరో 5-10 శాతం మేర కోత పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవీ
చెన్నై: ₹1,20,810; ₹1,10,740; ₹91,990
ముంబై: ₹1,20,810; ₹1,10,740; ₹90,610
ఢిల్లీ: ₹1,20,960; ₹1,10,890; ₹90,760
కోల్కతా: ₹1,20,810; ₹1,10,740; ₹90,610
బెంగళూరు: ₹1,20,810; ₹1,10,740; ₹90,610
హైదరాబాదు: ₹1,20,810; ₹1,10,740; ₹90,610
కేరళ: ₹1,20,810; ₹1,10,740; ₹90,610
పూణె: ₹1,20,810; ₹1,10,740; ₹90,610
వడోదరా: ₹1,20,860; ₹1,10,790; ₹90,660
అహ్మదాబాద్: ₹1,20,860; ₹1,10,790; ₹90,660
కిలో వెండి ధరలు ఇలా..
చెన్నై: ₹1,64,900
ముంబై: ₹1,50,900
ఢిల్లీ: ₹1,50,900
కోల్కతా: ₹1,50,900
బెంగళూరు: ₹1,51,900
హైదరాబాదు: ₹1,64,900
కేరళ: ₹1,64,900
పుణే: ₹1,50,900
వడోదరా: ₹1,50,900
అహ్మదాబాద్: ₹1,50,900










Comments