స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. అదే బాటలో వెండి, నేటి ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
మన దేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఉంటాయి. డాలర్ మారకపు విలువ దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఈ నేపధ్యంలో దేశీయంగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. బంగారం స్వచ్చత పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. మేలిమ బంగారం అని అంటారు. దీనిని 24 క్యారట్లుగా కొలుస్తారు. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఇతర లోహాలను కలుపుతారు. దీని స్వచ్చతను 22 క్యారట్లతొ కొలుస్తారు. పసిడి ధర ఆల్ టైం హైకి చేరుకొని కొనసాగుతూనే ఉంది. అయితే చాలా కాలం తర్వాత శుక్రవారం ( సెప్టెంబర్ 12వ తేదీ) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ధరలు తగ్గినప్పటికీ, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1 లక్ష పైన ఉంది. నేటి ప్రధాన నగరాల్లో పుత్తడి ధర ఎలా ఉందంటే..
తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు
ఈరోజు హైదరాబాద్లో బంగారం ధర 24 క్యారెట్ల బంగారం 10గ్రామల ధర.. పది రూపాయల మేర తగ్గి రూ. 1,10,499లకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం పది రూపాయలు తగ్గి రూ. 1,01,290లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి, పొద్దుటూరు, విజయవాడ, విశాఖ, వరంగల్, నిజామాబాద్ లలో ఉన్నాయి.
దేశీయంగా ప్రధాన నగరాల్లో నేటి ధరలు
ఈ రోజు దేశ రాజధాని డిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10గ్రామల ధర.. రూ. 110650లకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,01,440లకు చేరుకుంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10గ్రామల ధర రూ. 1,10,720, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,490 లకు చేరుకుంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10గ్రామల ధర రూ. 110500, 22 క్యారెట్ల బంగారంరూ.1,01,290లకు చేరుకుంది. ఇవే ధరలు కోల్కతా, బెంగళూరు , కేరళ, పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
వెండి ధర
బంగారం తర్వాత అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసే లోహం. వెండి . గత కొంతకాలంగా వెండి ధర చుక్కలను తాకుతూ దూసుకుపోతుంది. ఓ వైపు వెండి వినియోగం ఎక్కువ కావడం, మరోవైపు వెండిపై పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితం అని ముదుపరులు భావించడం వలన వెండి ధరలు రోజు రోజుకీ పై పైకి చేరుకుంటున్నాయి. బంగారం బాటలోనే పయనిస్తూ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఈ నేపధ్యంలో ఈ రోజు వెండి ధర దేశ రాజధాని డిల్లీ మినహా ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి కి 100 లు తగ్గి.. నేడు 1,39,900లకు చేరుకుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ. 1,29,800లుగా కొనసాగుతోంది.
Comments