• Jul 26, 2026
  • NPN Log

    అన్నపూర్ణ స్టూడియోస్  బ్యానర్ నుంచి తాజాగా ఓ ప్రీ లుక్ పోస్టర్ రాగానే అంతా, ‘కింగ్ 100’  సినిమా అప్డేట్ అని అనుకున్నారు. టైటిల్ టీజర్ అంటూ అనౌన్స్‌మెంట్ చేయగానే.. ఇంకేముంది ‘కింగ్ 100’ సినిమా టైటిల్ తెలిసిపోతుందని అంతా వార్తలు కుమ్మేశారు. అలా వార్తలతో హోరెత్తించిన వారందరినీ కింగ్ నాగ్ బురిడీ కొట్టించారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ అప్డేట్ ‘కింగ్ 100’వ సినిమాకు సంబంధించినది కాదు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్  సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రానికి ‘పళ్ళబురుసు’   అనే చిత్రానికి సంబంధించిన మ్యాటర్. అవును తాజాగా ఈ మూవీకి టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

    ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరో ‘బలగం’ తరహా చిత్రమిదనే ఫీల్‌ని ఈ టైటిల్ గ్లింప్స్ ఇస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

    ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించడం ఆకట్టుకుంటోంది. ఈ వినూత్న విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్న కాన్సెప్ట్‌, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘పళ్ళబురుసు’ నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement