• Jul 26, 2026
  • NPN Log

    యాటకల్లు (కుందుర్పి):

    తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని యాటకల్లు గ్రామంలో వెలసిన కుణే రామలింగేశ్వరుడిని స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దర్శించుకున్నారు. 7 శౌరీల అన్నదమ్ముల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు, గ్రామీణులు గజమాలతో, పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

    ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆలయానికి చేరుకుని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

    ​సకల హంగులతో కళ్యాణమంటపం పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే

    ​అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన కళ్యాణమంటపం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే తన సొంత నిధులు ₹15 లక్షలు అందించానని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సహకారంతో ఎంపీ నిధుల నుంచి మరో ₹25 లక్షలు మంజూరు చేయించి భవన నిర్మాణం పూర్తి చేయించామని తెలిపారు.

    ​ఇంకా అవసరమైన ఫ్యాన్లు, లైట్లు, తలుపుల ఏర్పాటుతో పాటు వధూవరుల గదులు, భోజన శాల, శౌచాలయాలను సకల హంగులతో త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఇక్కడే వైభవంగా జరుపుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.

    ​అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులతో కలిసి కూర్చుని మాట్లాడిన ఎమ్మెల్యే, వారితో పాటే అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, 7 శౌరీల అన్నదమ్ములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement