కనకమహాలక్ష్మి దేవస్థానంధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
వన్‌టౌన్‌లోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసింది. ఎంపీ ఎం.శ్రీభరత్, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ల సమక్షంలో ఆలయ ఈఓ శోభారాణి ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా కందుల నాగరాజు (మాజీ కార్పొరేటర్), సభ్యులుగా జి.ఎల్లయ్య, టి.వేణికుమారి, కె.స్వరూపారాణి, ఎస్.రామారావు, ఎన్.అప్పారావు, డి.శ్రీకాంత్, ఎం.నాగసుధ, సీహెచ్.మంజుల, కె.కళావతి, కె.అనురాధ, టి.నాగమణి, ఎక్స్అఫీషియో సభ్యునిగా ప్రధాన అర్చకులు కె.శ్రీనివాసశర్మ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పాలక మండలి సభ్యులంతా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఏఈవో రాజేంద్రకుమార్ సమక్షంలో కార్యక్రమాన్ని పూర్తి చేశారు.










Comments