• May 26, 2026
  • NPN Log

    నార్త్ కెరొలినాలోని షార్లెట్‌లో స్థానిక ఎన్నారైలు ఏపీ కర్నూల్ రేంజ్ డీఐజీ డా.ప్రవీణ్ కోయను ఘనంగా సన్మానించారు. మే 17వ తేదీ, ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. టీఏజీసీఏ, టీటీఏ, తానా, ఎన్నారై టీడీపీ షార్లెట్ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆయనను సత్కరించే అవకాశం దక్కడం తమకు లభించిన గౌరవమని నిర్వాహకులు వ్యాఖ్యానించారు. స్థానిక తెలుగు సమాజానికి ఇది చారిత్రాత్మకమైన, భావోద్వేగపరమైన సందర్భంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 109 మందికి పైగా పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement