• May 26, 2026
  • NPN Log

    భీమవరం : తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉన్నతాధికారులను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆశ్రయించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య కేంద్రం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్‌లో అనంత శ్రీరామ్ ఈ ఫిర్యాదు చేశారు. పాలకొల్లు సమీపంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారంటూ ఆయన తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని గుర్తు చేశారు.

    ఈ స్థలం కోసం మాజీ ఎంపీ హరి రామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ తన తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తూ.. వారిని మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ‌కి అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. వారికి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను అనంత శ్రీరామ్ కోరారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement