• Jul 26, 2026
  • NPN Log

    తమిళ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి సినిమా జన నాయగన్. హెచ్‌ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. పూజాహెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ మూవీ ఇటీవ‌ల ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో తాను న‌టించిన‌ స‌న్నివేశాలు పూర్తిగా తొల‌గించారు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది న‌టి ఆనంది. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను సైతం విడుద‌ల చేసింది. విజ‌య్ చివ‌రి చిత్రం కావడం, ఆయ‌న‌తో ప‌ని చేసే అవ‌కాశం రావ‌డంతో ఎంతో ఆనందించాన‌ని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం కోసం ఏడాది పాటు క‌ష్ట‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది. అయితే.. రిలీజ్ అయిన త‌రువాత చూస్తే తాను న‌టించిన స‌న్నివేశాలు అన్నింటిని పూర్తిగా తీసివేశార‌ని ఎంతో బాధ‌ప‌డుతూ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.

    ఆనంది క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్, యోగా ట్రైన‌ర్ కూడా. అంతేకాదండోయ్ పలు సీరియ‌ల్స్‌లోనూ న‌టించింది. డాన్స్ జోడి డాన్స్ 3.0, జోడి నంబ‌ర్ 1 వంటి రియాలిటీ షోల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

     

     

    ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సెన్సార్ ప‌ర‌మైన ఇబ్బందులు ఎదురైన సంగ‌తి తెలిసిందే. 12 కీల‌క మార్పులు చేయాల‌ని సెన్సార్ బోర్డు సూచించింది. ఈ క్ర‌మంలోనే ఆనంది స‌న్నివేశాలు క‌ట్ చేసి ఉండొచ్చున‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement