జూలై 27 నుంచి టీడీపీ 'డోర్ టు డోర్'.. ప్రజావేదికలో అవగాహన సదస్సు – విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు – పాల్గొన్న అబ్జర్వర్ రామకృష్ణ, నాయకుడు దేవినేని ధర్మతేజ
కళ్యాణదుర్గం:
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమలగుర్తి సురేంద్ర బాబు ఆధ్వర్యంలో జూలై 27 నుంచి ప్రారంభం కానున్న 'టీడీపీ డోర్ టు డోర్' కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా స్థానిక ప్రజావేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల కన్వీనర్లు, బిఎల్ఏ (BLA)లు, పార్టీ బాధ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ అబ్జర్వర్, వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నాయకులకు, కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ స్పష్టంగా వివరించాలన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సురేంద్ర బాబు నాయకత్వంలో జరిగే ఈ డోర్ టు డోర్ ప్రచారం ద్వారా ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలిపారు. నాయకులు, శ్రేణులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.










Comments